అమెరికాకు ఇరాన్ హ్యాకర్ల షాక్.. 2,300 మంది సైనికుల డేటా లీక్!
- ఇరాన్‌తో సంబంధాలున్న హండాలా అనే సైబర్ గ్రూప్ దాడి
- పర్షియన్ గల్ఫ్‌లోని 2,379 మంది యూఎస్ మెరైన్స్ డేటా లీక్
- సైనికుల వాట్సాప్‌కు బెదిరింపు సందేశాలు పంపిన హ్యాకర్లు
- ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన అమెరికా రక్షణ శాఖ పెంటగాన్
- గతంలో ఎఫ్‌బీఐ డైరెక్టర్ ఈమెయిల్‌ను హ్యాక్ చేసిన ఇదే గ్రూప్
ఇరాన్‌తో సంబంధాలున్న ఓ హ్యాకర్ల బృందం అమెరికాకు గట్టి షాక్ ఇచ్చింది. పర్షియన్ గల్ఫ్‌లో మోహరించిన 2,379 మంది అమెరికా మెరైన్స్ వ్యక్తిగత వివరాలను లీక్ చేసినట్లు 'హండాలా' అనే సైబర్ గ్రూప్ ప్రకటించింది. తమ టెలిగ్రామ్ ఛానెల్లో సైనికుల పేర్లు, ఇతర వివరాలను మంగళవారం విడుదల చేసినట్లు తెలిపింది.
తమ నిఘా సామర్థ్యాలను చాటుకునేందుకే ఈ లీక్‌కు పాల్పడినట్లు హ్యాకర్లు పేర్కొన్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. అంతటితో ఆగకుండా ఆ సైనికుల వాట్సాప్‌కు "మేం మిమ్మల్ని గమనిస్తున్నాం, మిమ్మల్ని లక్ష్యంగా చేసుకోవచ్చు" అంటూ బెదిరింపు సందేశాలు పంపినట్లు ఇరాక్‌కు చెందిన షఫాక్ న్యూస్ రిపోర్ట్ చేసింది. సైనికుల కుటుంబ సభ్యుల వివరాలు, ఇంటి చిరునామాలు, వారి దినచర్యలు, కదలికల సమాచారం కూడా తమ వద్ద ఉందని హ్యాకర్ల బృందం హెచ్చరించింది.
ఈ ఘటనపై అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ తీవ్రంగా స్పందించింది. సైనికుల వివరాలు బహిర్గతం కావడం భద్రతకు పెను ముప్పు అని భావిస్తూ ఈ సైబర్ దాడిపై ఉన్నత స్థాయి దర్యాప్తు ప్రారంభించింది. డేటా ఎలా చోరీకి గురైందనే దానిపై అధికారులు దృష్టి సారించారు.
ఇదే హండాలా గ్రూప్ గత నెలలో ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ వ్యక్తిగత ఈ-మెయిల్‌ను హ్యాక్ చేసినట్లు ప్రకటించుకోవడం గమనార్హం. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఈ సైబర్ దాడి జరగడం ప్రాధాన్యంను సంతరించుకుంది. ఈ ఘటనతో అంతర్జాతీయ ఘర్షణల్లో సైబర్ దాడులు ఎంత కీలక పాత్ర పోషిస్తున్నాయో మరోసారి స్పష్టమైంది.